Share News

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?

ABN , Publish Date - Dec 03 , 2024 | 07:59 PM

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మంగళవారం అమరావతిలో జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన ఏపీని పోర్టుల హబ్‍గా మార్చే పాలసీలు తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీనిపై వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సంధించింది.

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?
AP PCC Cheif YS Sharmila

విజయవాడ, డిసెంబర్ 03: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలుపై చర్యలు తీసుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి ప్రభుత్వం ట్రెండ్‌గా పెట్టుకుందని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Viral News: ఒకరు ఆవలిస్తే, మిగిలిన వారు.. ఎందుకు.. కారణమేమిటి?

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు

అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా చేపట్టలేదని విమర్శించారు. విచారణకు సైతం దిక్కులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టును సైతం గుంజుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి

పుట్నాల కింద విక్రయించేశారు

ఆంధ్రప్రదేశ్‍ను పోర్టుల హబ్‍గా మార్చే పాలసీలు సరే కానీ.. గంగవరం పోర్ట్ సంగతి ఏమిటంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఏటా దాదాపు రూ. 2 వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి రాసి ఇచ్చిందన్నారు. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ. 9 వేల కోట్ల విలువ జేసే 10 శాతం వాటాను కేవలం రూ. 640 కోట్లకు పుట్నాల కింద విక్రయించేశారని చెప్పారు.

Viral News: ఆపరేటర్ చేసిన చిన్న తప్పిదం.. 125 రైళ్ల ఆలస్యానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

కళ్ళు మూసీ తెరిచేలోగా..

అలాగే 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను సైతం అదానీకి కట్టబెట్టారని నిప్పులు చెరిగారు. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ (BOT) కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అదని వివరించారు. పైగా అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవని... కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారన్నారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగమని బుకాయించారని గత వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.

Also Read: గుట్కా, పొగాకు తింటే.. ఈ రోగాలు గ్యారంటీ

కూటిమి ప్రభుత్వానికి డిమాండ్..

ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు, ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలకు ఎంత మాత్రం పొంతన లేదన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Also Read: గంజాయి చాక్లెట్లు విక్రయం.. పల్నాడులో ఈగల్ డైరెక్టర్ పర్యటన

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి... నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పైవిధంగా స్పందించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 08:00 PM