Share News

CM Chandrababu: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:43 PM

జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్‌ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

CM Chandrababu: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్‌‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ(మంగళవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 3గంటల పాటు ఈ సమావేశం సాగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆ‌ర్‌ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు‌ను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ చెబుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం కావడం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ మోడ్‌లో పనిచేస్తే జలజీవన్ పథకం అద్భుత ఫలితాలు ఇస్తుందని మంత్రి నారా లోకేష్ వివరించారు.


ALSO READ: మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

జేజేఎం ప్రతీ ఒక్కరికీ రీచ్ అయ్యే అతి పెద్ద ప్రాజెక్ట్ అని లోకేష్ తెలిపారు. పథకాలు సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు గట్టిగా చెప్పారు. అధికారులకు పనిపై కమిట్మెంట్ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారుల్లో అలసత్వం కనిపిస్తోందని మండిపడ్డారు. ఆయా శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని అధికారులు చెప్పాలి కదా అని నిలదీశారు. ఢిల్లీకి వెళ్తే అక్కడి అధికారులందరూ మీ బ్యూరోక్రసీ ఎక్కడుందని అడుగుతున్నారని అన్నారు. మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు. మంత్రులు కూడా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని.. ఇలా చేస్తే మంత్రులకు అవగాహన పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.


పులివెందుల, ఉద్దానం, డోన్‌లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్12తో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6నెలలు పూర్తవుతుంది. ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టాం, చిన్న చిన్న సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని మాటిచ్చారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలూ పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డిసెంబర్ 15వ తేదీన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఐటీ, టెక్స్‌టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు కూడా మంత్రివర్గం ఆమోదించింది.


ALSO READ: రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు

ఆ మాఫియాలను అరికట్టాలి

2chandrababu.jpg

‘‘బియ్యం, భూ దురాక్రమణ మాఫియాలను అరికట్టాలి. కాకినాడ పోర్ట్‌ను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కునారు. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 వేల కోట్లు పైనే ఉంటుంది. దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందనీ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. 7 వేల ఎకరాలు మొత్తం లాగేసుకున్నారు. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీరావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాగేసుకున్నారు. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్...ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదు. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారు. జగన్ తప్పులు చేసి ఆయనే అరుస్తున్నారు. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నాం. పథకాలు మీద అభిప్రాయ సేకరణ చేయిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Payyavula: మా వియ్యంకులు చేసేది ఆ వ్యాపారం మాత్రమే

TDP MLA: ‘చెవిరెడ్డి’ చేసింది తప్పుకాదా.. ప్రతిఒక్కరూ ఆలోచించండి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 04:09 PM