Home » CM Chandrababu Naidu
శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, కల్మషం లేకుండా ముక్కుసూటితనంగా మాట్లాడటం ఆయన నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా వెళ్తున్న అపసవ్య ధోరణిని సరిచేయడం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
సీఎం చంద్రబాబుకు ఏపీహైకోర్టు ఎంప్లాయూస్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. హైకోర్టు విభజన సమయంలో, తక్కువ వ్యవధిలో, తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కె. రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా అప్పులు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రాధాన్యత అని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా తమ విధానం మార్చుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్ పోలిటికల్గా సంచలనం సృష్టించారన్నారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.