Share News

TDP: సరికొత్త రికార్డు సృష్టించిన టీడీపీ పార్టీ.. ఏకంగా..

ABN , Publish Date - Dec 14 , 2024 | 07:56 PM

టీడీపీ సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో నిలిచాయని ఆయన చెప్పారు.

TDP: సరికొత్త రికార్డు సృష్టించిన టీడీపీ పార్టీ.. ఏకంగా..
Telugu Desam Party

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, టీడీపీ పార్టీపై ప్రజల్లో అభిమానం పెరిగిపోయింది. ఈ మేరకు అక్టోబర్ 26 నుంచి చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య ఏకంగా 73 లక్షలకు చేరింది. సరికొత్త రికార్డుతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నిండిపోయింది.


రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో నిలిచాయి. 73 లక్షల మందిలో 85 వేల మంది తెలంగాణ ప్రజలు సభ్యత్వం పొందారు. అయితే ఈ కార్యక్రమంపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన నేతలను ముఖ్యమంత్రి అభినందించారు. కేడర్ పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ మేరకు టీడీపీ నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం తీసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు. సభ్యత్వ నమోదుతో బలమైన టీడీపీ ఆర్మీని తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు పార్టీకి బలమైన కార్యకర్తలుగా మారుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


మరోవైపు ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా ఏళ్లపాటు పార్టీలో కొనసాగుతున్న వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి నేతలు పదవులు కావాలని అడగడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించాలని పార్టీ సూచించారు. కొందరు ఎమ్మెల్యే అయిపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఏది వచ్చినా అది కేవలం పార్టీ వల్ల మాత్రమే వచ్చాయనే విషయాన్ని నేతలు దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

Avinash Reddy: అధికారులను బంధించి ఎన్నికలు నిర్వహిస్తారా: ఎంపీ అవినాశ్ రెడ్డి..

Updated Date - Dec 14 , 2024 | 08:06 PM