Home » Collages
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్ నుంచి నెక్సస్ మాల్ వరకు హౌసింగ్ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే 200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్ పంపింది.
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు ఉద్దేశించిన దోస్త్ మూడోదశ కౌన్సెలింగ్‌లో 80,312 మంది దరఖాస్తు చేసుకోగా... 73,662 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) పరిఽధిలోని పదోన్నతుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాఽధికారుల తీరుపై సీనియర్ ఆచార్యులు, అధ్యాపకులు అభ్యంతరం తెలుపుతున్నారు.