Share News

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:30 AM

తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

  • 80 మందిని నియమించుకున్న సంస్థ

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా బోధించే ఉపాధ్యాయులు/అధ్యాపకుల కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రఖ్యాత విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీలలో బీటెక్‌, ఎంటెక్‌, ఎంఎస్సీ పూర్తి చేసిన 180 మంది ప్రతిభావంతులైన అభ్యర్థులను క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపిక చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అన్ని పోటీ పరీక్షలకు అత్యంత కీలకమైన గణితం, రసాయన, భౌతిక శాస్త్రాలతో పాటు బయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన 180 మంది ట్రైనీ ఫ్యాకల్టీ అభ్యర్థులను నారాయణ రిక్రూట్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ ద్వారా నియమించుకున్నామని వివరించింది.


ప్రతిభావంతలైన నవతరం అభ్యర్థులను ప్రోత్సహించేందుకే నారాయణ విద్యాసంస్థ చొరవ తీసుకుందని నారాయణ విద్యా సంస్థల సీఇవో పునీత్‌ కొత్తప తెలిపారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ పి. సింఽధూర నారాయణ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేటి నుంచే వనరులను సమకూర్చుకోవడం నారాయణ ముందు చూపునకు నిదర్శనమన్నారు. మరో డైరెక్టర్‌ శరణి నారాయణ మాట్లాడుతూ.. ప్రతి టీచర్‌ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ముఖ్య లక్షణాల గురించి వివరించారు. కాగా రాబోయే 90 రోజుల్లో ట్రైనీ ఫ్యాకల్టీ అభ్యర్థులకు తరగతి శిక్షణా కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నామని ఆ సంస్థ వెల్లడించింది.

Updated Date - Jul 07 , 2024 | 03:30 AM