Home » Congress 6 Gurantees
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్న(ఆదివారం) తాను దేవరుప్పుల మండలం లక్ష్మి భాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.
బీఆర్ఎస్(BRS) నుంచి వేరే పార్టీలోకి వెళ్లేవారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి*(Palla Rajeshwar Reddy) హెచ్చరించారు. పార్టీ మారే నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. పార్టీ మారిన నేతలని ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు లేక తమ పార్టీ నేతల వెంట పడుతున్నారని మండిపడ్డారు. కొందరు పిరికి పందలు పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని.. అక్రమంగా మామూళ్లు వసులు చేయడంలో వారు అరితేరారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లో ఓల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయల నష్టం కలగచేస్తున్నాయని చెప్పారు.
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని మాజీమంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గురువారం నాడు రేఖ్యా తండా, దుబ్బ తండాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
తాము ఇంకా గేట్లు తెరవలేదని.. తెరిస్తే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీల్లో నేతలు ఎవరూ ఉండరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ (Congress) లోకి రమ్మని తాము ఎవరిని అడగటం లేదని.. స్వచ్ఛందంగా నేతలే తమ పార్టీలో చేరుతామని వస్తున్నారని వివరించారు. గురువారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్నా కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి డీకే సరమసింహారెడ్డి (Samarasimha REDDY) కోరారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణనది నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాట దక్కడం లేదని చెప్పారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాట రావాల్సి ఉందన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగిందని.. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏంటో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలకు చూపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy) హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నాడు జరిగిన "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వాన్ని ప్రయోగించారని అన్నారు.
అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పోరాటాలతో వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయ్యిందన్నారు. పదేళ్లలో తెలంగాణ ఇబ్బందులకు గురైందని చెప్పారు.
ఢిల్లీలో ఏపీ భవన్ విభజన పూర్తయిందని.. తెలంగాణ భవన్ డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. సకల సదుపాయాలతో తెలంగాణ భవన్ నిర్మణం ఉంటుందని చెప్పారు.
CM Revanth On 100 Days Ruling: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల పాలన ఎలా ఉంది..? ప్రజలకు ఈ ప్రభుత్వంతో జరిగిదేంటి..? ఈ వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలేంటి..? ఆరు గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ మాత్రం హామీలను నెరవేర్చింది..? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడిందేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు...