Home » Congress 6 Gurantees
అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తెలిపారు.ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ (Dasoj Shravan) బహిరంగ లేఖ రాశారు. పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా మీ పరిపాలన చాల అధ్వాన్నంగా మారిందని అన్నారు.
తెలంగాణలో రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
LRSపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(CM Revanth ReddY) మరోసారి ట్విట్టర్(ఎక్స్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో సాగు, తాగునీరు, కరెంట్ సమస్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని, తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చిందని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీల అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అవసరమైన ఆర్థిక వనరులపై దృష్టి సారించింది. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణకు ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. నిధుల కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.