Share News

HARISH RAO: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

ABN , Publish Date - Dec 23 , 2024 | 07:04 PM

పేదలను, రైతులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్‌రావు విమర్శించారు.

HARISH RAO: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

వరంగల్ : మాజీ సీఎం కేసీఆర్ నిర్మించ తలపెట్టిన 24 అంతస్తుల ఎంజీఎం ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్షం చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. 2023 అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి..ఏమాత్రం పురోగతి లేదని అన్నారు. ఏడాది వ్యవధిలో 16 శాతం పనులు పూర్తి చేసే తీరికలేదని చెప్పారు. ఇవాళ(సోమవారం) వరంగల్‌లో హరీష్‌రావు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానంటున్న రేవంత్ రెడ్డి ఆస్పత్రి నిర్మాణాన్ని ఆపారని మండిపడ్డారు.


ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలని.. లేకపోతే పోరాటాలు చేస్తామని అన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనులను ఆపడం దద్దమ్మ పని అని విమర్శించారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే రేవంత్ రెడ్డి పని అని ఎద్దేవా చేశారు. ఆస్పత్రి నిర్మాణం ఆపడం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎంతోమంది సీనియర్లను తొక్కుకుంటూ వచ్చి సీఎం అయ్యారని హరీష్‌రావు ఆరోపించారు.


కాంగ్రెస్‌లో పుట్టి.. పెరిగిన నాయకులను తొక్కి సీఎం అయ్యాడని సంచలన ఆరోపణలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా తొక్కుడు పదవులు పైన ఎక్కడం ఆయన నైజమని విమర్శించారు. ఎల్లకాలం ఇలాంటి సంస్కృతి సాగాదని హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్ క్రూరమృగాల మధ్య నుంచి వచ్చానని కిరాతకంగా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను, రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే రేవంత్‌కు తెలిసిన పాలన అని హరీష్‌రావు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!

Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..

Rachakonda CP: ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన రాచకొండ సీపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 07:11 PM