Share News

MLC Kavita: దేవుళ్లపై ఒట్లు తప్ప రేవంత్ ఏం చేశారు.. కవిత సూటి ప్రశ్నలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:37 PM

రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి మరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLC Kavita: దేవుళ్లపై ఒట్లు తప్ప రేవంత్ ఏం చేశారు.. కవిత సూటి ప్రశ్నలు

హైదరాబాద్: దేవుళ్ల సాక్షిగా హామీలు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరిచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 317జీవో తెచ్చుకున్నామని గుర్తుచేశారు. 317 జీవో వల్ల సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. సమస్యలు ఉన్నాయని చెప్పడమే కాదు పరిష్కారం కూడా చూపాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుందని.. ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంకా బీఆర్ఎస్‌ పార్టీని పాయింటవుట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


రుణమాఫీపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు. తేదీలతో సహా కవిత గుర్తుచేశారు. ‘‘ఏడుపాయల దుర్గమ్మ - ఏప్రిల్ 20, 2024. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి - ఏప్రిల్ 21, 2024. బాసర సరస్వతి అమ్మవారి - ఏప్రిల్ 22, 2024. జోగులాంబ అమ్మవారు -ఏప్రిల్ 23, 2024. రామప్ప దేవాలయం శివయ్య - Apr ఏప్రిల్, 2024. ఆర్మూర్ సుద్ధలగుట్ట - మే 9, 2024 . రైతులకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ సాక్షిగా హామీ ఇచ్చారు. సీఎం హామీని నెరవేర్చనందుకే ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చాం. హామీని నెరవేర్చనందుకు మీద్వారా మా నిరసన తెలియజేస్తున్నాం’’ అని కవిత అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: అదానీకి ప్రధాని అండ

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 19 , 2024 | 12:38 PM