Share News

KTR: రాజీనామా చేస్తా.. వాళ్లకు కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:07 PM

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

KTR: రాజీనామా చేస్తా.. వాళ్లకు కేటీఆర్ సవాల్

హైదరాబాద్: రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. కొండారెడ్డి పల్లి, పాలేరు ఎక్కడికైనా వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులను అడుగుదామని అన్నారు. వంద శాతం రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ అన్నారు.


రైతు భరోసాను ప్రారంభించింది మేమే: కేటీఆర్‌

రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక..రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.


వారి కోసం పనిచేయొద్దు...

రైతుబరోసాపై అసెంబ్లీలో చర్చలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అదాని కోసం సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేవలం అనుముల కుటుంబం కోసం, బామ్మర్ది కోసం, అన్నదమ్ముల కోసం పని చేయకండి అని హెచ్చరించారు. అన్నదాతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని కోరారు.రైతు రుణమాఫీ పూర్తిగా జరిగింది అంటున్నారని.. 60 శాతం అయ్యిందని మరొకరు అంటున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పాలని అన్నారు. 25 శాతమా, 50 శాతమా మీకే స్పష్టత లేదని విమర్శించారు. కోతలు పెడితే అది మీ ఇష్టమని అన్నారు. కౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలన్నారు. రాష్ట్ర రైతాంగం కోసం పనిచేయాలని కేటీఆర్ చెప్పారు.


అసెంబ్లీ ఆలస్యంపై హరీష్‌రావు ఫైర్

harish-assmbly.jpg

శాసనసభ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హారీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10గంలకు ప్రారంభంకావాల్సిన సభ.. 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని ప్రశ్నించారు. సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని హరీష్‌రావు గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని హరీష్‌రావు చెప్పారు. సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.


మిషన్ భగీరథలో అవినీతి ఎలా జరిగింది: మాజీ మంత్రి హరీష్‌రావు

మిషన్ భగీరథ ఖర్చే రూ.28వేల కోట్లు అయిందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. అందులో రూ.50వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను డిమాండ్ చేశారు. నల్గొండకు ఏం చేయలేదు అనడం సరికాదని హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 12:31 PM