Home » Congress Govt
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే ప్రధానమైన నిబంధన ఉండేది. ఆ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది.
Telangana: చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి.
Telangana: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టింది. నిన్న ( సోమవారం) ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన బీజేపీ దీక్ష ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు.
Telangana: గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులున్నట్లు ప్రభుత్వం గుర్తించారు. ఆధార్, బ్యాంకు అకౌంట్లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరి చేశారు.
తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు.హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
పది నెలల్లోనే 11062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 30వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని ప్రశ్నించారు.
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.