Share News

Ponguleti: ముగిసిన తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా పర్యటన

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:26 PM

తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. మూసీలాగే ఒకప్పుడు సియోల్ హాన్ రివర్ కూడా మురికి కుపంగా ఉండేదని అన్నారు. హాన్ రివర్‌ను ఎలా అభివృద్ది చేసి స్వచ్చంగా మార్చారో తెలుకున్నామని చెప్పారు.నది వెంట ఉన్న పేద వారికి పునరావాసంతో పాటు ఏం పరిహారం ఇచ్చారో చర్చించినట్లు తెలిపారు.

Ponguleti: ముగిసిన తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా పర్యటన
Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్: తెలంగాణ మంత్రుల దక్షిణ కొరియా పర్యటన ఇవాళ(గురువారం)ముగిసింది. నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మున్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఎమ్మెల్యేలు పర్యటించారు. ఈ రోజు రాత్రికి మంత్రులు, అధికారుల బృందం హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఎంఏపీఓల రిసోర్స్ ప్లాంట్, చియాన్గ్ జి చియాన్ రివర్, హాన్ రివర్, ఇన్చియాన్ ట్రీట్ మెంట్ ప్లాంట్, స్మార్ట్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను సందర్శించి వివరాలు అడిగి మంత్రుల బృందం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు.


మూసీలాగే ఒకప్పుడు సియోల్ హాన్ రివర్ కూడా మురికి కుపంగా ఉండేదని అన్నారు. హాన్ రివర్‌ను ఎలా అభివృద్ది చేసి స్వచ్చంగా మార్చారో తెలుకున్నామని చెప్పారు.నది వెంట ఉన్న పేద వారికి పునరావాసంతో పాటు ఏం పరిహారం ఇచ్చారో చర్చించినట్లు తెలిపారు. మూసీ వెంట ఉన్న ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌తో పాటు కొంత ఆర్థిక సహాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తుచేశారు. ప్రతిపక్షాల అభిప్రాయం అడిగితే మూసీ మురికితో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


హన్ నది వెంట ప్రజలకు ఎలాంటి సహాయం చేశారో అలాగే మూసీ వెంట ఉన్న ప్రజలకు సేవల చేయాలని భావిస్తున్నామని తెలిపారు. స్మార్ట్ సిటీ సందర్శించామని అన్నారు. కాలుష్య రహితంగా ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీని కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

KTR : కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది

Jagdish Reddy: రైతులను మోసగిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 09:27 PM