Share News

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:57 PM

రేవంత్ ప్రభుత్వం సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే నిర్మాణాత్మకంగా పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొత్త రైల్వే‌లైన్‌ల ఏర్పాటు, డబ్లింగ్, త్రిబ్లింగ్, క్వాట్రిబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ వంటివి వేగంగా పూర్తిచేస్తున్నారని అన్నారు. 90 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేశారని తెలిపారు. ఇవాళ(గురువారం) రైలు నిలయంలో కిషన్‌రెడ్డి రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు.


ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 రైల్వే స్టేషన్లను అధునీకరిస్తున్నామని అన్నారు. కాజీపేటలో రూ.680 కోట్లతో రైల్వే మానిఫ్యాక్షరింగ్ యూనిట్ (ఆర్.ఎం.యూ) రాబోతుందని స్పష్టం చేశారు. 2025 ఆగస్టు నాటికి అందుబాటులోకి రాబోతుందని తెలిపారు.


ఫైనల్ లోకేషన్ సర్వేలో 15 ప్రాజెక్టులకు గానూ 2,647 కి. మీలు ఉంటుందని.. దీని కోసం సుమారు..రూ. 86వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. కొత్త ప్రాజెక్టుల్లో 13 ప్రాజెక్టులకు 1,445 కి, మీల నిర్మాణానికి...రూ. 17,862 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయించామని అన్నారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


రేవంత్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు పొడిగిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగర ప్రజలు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణతో పాటు రైల్ రింగ్ రోడ్ సర్వే కూడా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

KTR : కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారింది

Jagdish Reddy: రైతులను మోసగిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. కాంగ్రెస్‌పై జగదీష్ రెడ్డి ధ్వజం

TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 09:07 PM