Home » Congress
రేవంత్ రెడ్డి సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యాడని, ఇక తన వల్ల కాదని దూస గణేష్ అనే నేతన్న తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంతరి కేటీఆర్ అన్నారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ కూతుళ్లకు సమాధానం చెప్పాలన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్ పై కేసు నమోదుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాబోయే సీఎం... అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆటపట్టించారు.
బీఆర్ఎస్ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లచొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫారాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
అంబేడ్కర్‌ను కించపరిచిన అమిత్‌షాను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే... అప్పులు తీసుకోవడంలో బీఆర్‌ఎ్‌సను మించిపోయేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారాల్లో అసలు అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఎలా కేసు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ధ్వజమెత్తారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను పంచ తీర్ధ్‌గా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షిని అని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు.
స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు.