Home » Congress
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావటంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు మొక్కుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు శబరిమల వెళ్ళటానికి నల్ల దుస్తులు ధరించినట్లుందని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు మూడో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది.
ఓబీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు.
సార్... మీరెవరూ..? అంటూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా్‌సకు అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది నుంచి ప్రశ్న ఎదురైంది.
గౌతమ్ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. తర్వాత సభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2012లో పార్టీకి రెండు సంక్షోభాలు ఎదురయ్యాయని, సోనియాగాంధీ అనారోగ్యం, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ చేయడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని అయ్యర్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బొమ్మతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తెచ్చారని కవిత ప్రశ్నించారు.
‘‘బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల, బహుజనుల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కోసమే పలు పథకాలను చేపట్టి అమలు చేస్తోందని చెప్పారు.