Bhupender Yadav: ఓబీసీలకు కాంగ్రెస్ అన్యాయం
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:01 AM
ఓబీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు.
కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
ముస్లింల రిజర్వేషన్లతో ఓబీసీలకు అన్యాయం : ఎంపీ లక్ష్మణ్
న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఓబీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఆరోపించారు. ఓబీసీలకు దక్కాల్సినవి ఆ పార్టీ దక్కనివ్వలేదని విమర్శించారు. వెనుకబడిన తరగతుల సాధికారత కేంద్రం డైరక్టర్ తూళ్ల వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ’ఓబీసీలు, సామాజిక సంస్కరణలు, గవర్నెన్స్’ అనే అంశంపై డాక్టర్ అంబేడ్కర్ ఆంతర్జాతీయ కేంద్రంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి ఓబీసీలలో పరివర్తన కనిపిస్తోందని, స్వాభిమానంతో జీవించాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఓబీసీల అభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీ, తెలంగాణలో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తూ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, తమ పార్టీ సరైన సమయంలో స్పందిస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్‌గాంధీ తిరుగుతున్నారని, అయితే కాంగ్రెస్ హయాంలోనే ఎమర్జెన్సీని విధించారని విమర్శించారు. దేశంలో ప్రజలంతా జమిలి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని, జమిలి ఎన్నికలతో దేశానికి మేలు జరుగుతుందని అన్నారు.