Home » Congress
‘‘బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల, బహుజనుల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కోసమే పలు పథకాలను చేపట్టి అమలు చేస్తోందని చెప్పారు.
ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇళంగోవన్ గత నెల రోజులుగా అస్వస్థతతో ఉన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో నవంబర్ 11న ఆయన ఆసుపత్రిలో చేరారు.
లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవాళ మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది.
పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రె్‌సకు ఆ నివేదిక చెంపపెట్టు అని వాఖ్యానించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ రాష్ట్రంలో ఉన్నారా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ..
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్. స్త్రీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కారు బలంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది.