Share News

Breaking News: అవంతి రాజీనామాపై బీజేపీ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - Dec 12 , 2024 | 03:09 PM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.

Breaking News: అవంతి రాజీనామాపై బీజేపీ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే..
Breaking News

Live News & Update

  • 2024-12-12T20:41:34+05:30

    లోన్‌యాప్స్‌పై విజిలెన్స్ డిజి హరీష్ కుమార్ గుప్తా

    • లోన్ యాప్స్ చైనా నుంచి ఆపరేట్ అవుతున్నాయి

    • డేటా అంతా చైనాలోని సర్వర్లకు వెళ్తోంది

    • చైనా నుంచే ఈ యాప్ లను నిర్వహిస్తూ, స్థానికంగా ఏజెంట్ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది.

    • ఎన్ని యాప్ లు ఉన్నాయి, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారన్న వివరాలు తమవద్ద లేవని వెల్లడి

    • దీనిపై స్పష్టమైన చట్టం తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన హరీష్ కుమార్ గుప్తా

  • 2024-12-12T19:36:41+05:30

    వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజీనామాపై బీజేపీ ఎమ్మెల్యే రియాక్షన్

    • వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస రావు రాజీనామాపై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

    • వైసీపీకి అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేయడం మంచి పనే

    • అవంతి మా పార్టీలోకి వస్తారనే సంగతి తెలియదు.. ఆయన వస్తే స్వాగతిస్తాం

    • భవిష్యత్తులో వైసీపీ ఉండదు..ఉంటుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా

    • బిజెపిలో వైసిపి విలీనం చేస్తామంటే ఒప్పుకోము

    • వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆపార్టీని వీడడం అనైతికం

    • జగన్ నమ్మి వాళ్లకి రాజ్య సభ పదవులు ఇచ్చారు

    • సాంకేతికంగా వాళ్ళు రాజీనామాలు చేసి పార్టీ మారడం సాంకేతికంగా కరెక్టే.. కానీ అది నైతికం కాదు

    • వారి స్థానంలో నేను రాజ్య సభ సభ్యుడిగా ఉంటే అటువంటి నిర్ణయాలు తీసుకునే వాడిని కాదు

  • 2024-12-12T17:45:20+05:30

    అల్లూరి జిల్లాలో విషాదం

    • అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిన్నారి మృతిపై తల్లిదండ్రుల అయోమయం

    • అంగన్వాడీ సెంటర్లో చిన్నారికి టీకా వేయించిన తర్వాత జ్వరం

    • నాటు వైద్యుని దగ్గరకి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

    • చిన్నారికి శ్వాస అందకపోవడంతో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలింపు

    • చింతపల్లి వైద్యుల తీవ్ర ప్రయత్నాలు

    • చికిత్స అందించినా చిన్నారి మృతి

    • అంగన్వాడీ సెంటర్‌లో ఇచ్చిన ఇంజక్షన్ చిన్నారి మృతికి కారణమా? లేక వైద్యుల తప్పిదమే మృతికి కారణమా? విచారణ చేపట్టాలని చిన్నారి కుటుంబ సభ్యుల డిమాండ్

  • 2024-12-12T17:29:11+05:30

    విజయసాయిరెడ్డిపై వర్శ ఫైర్..

    • వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీరుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్శ ఆగ్రహం

    • గన్‌లతో బెదిరించి కాకినాడ సీ-పోర్టు ను వాటాలుగా కొట్టేసిన వైసీపీ నేతలు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది

    • కాకినాడ సి- పోర్ట్ ను అరబిందోకి రాయించుకు న్నపుడు వైసిపి నేతలకు రైతులు జ్ఞాపకం లేదా

    • జీ ఎమ్మార్ ను బెదిరించి కాకినాడ సెజ్ ను రూ.4వేల కోట్లకు లాకున్న జగన్ కు అప్పుడు రైతులకు న్యాయం చేయాలనీ తెలియలేదా

    • రెండు వేల ఎకరాలు డీ - నోటి ఫై చేసిన సెజ్ భూమిలో 14 ఎకరాలు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కొనుగోలు చేసిన మాట వాస్తవమా కాదా

    • వైసిపి హయాంలో ఎకరానికి రూ.10 లక్షలు అని చెప్పి ఆ త ర్వాత రైతులకు ఆ డబ్బు ఇవ్వడానికి జగన్‌కు ఎందుకు చేతులు రాలేదు

  • 2024-12-12T17:20:03+05:30

    వర్షాల నేపథ్యంలో హోంమంత్రి కీలక ఆదేశాలు..

    • భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

    • తిరుపతి, సూళ్లూరుపేటలో వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి

    • ఘాట్ రోడ్లు, కొండచరియలున్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు

    • వర్షాలు కురుస్తున్న ప్రాంతాల ప్రజలకు హెచ్చరికల సందేశాలు పంపాలని విపత్తుశాఖకు ఆదేశం

  • 2024-12-12T15:09:24+05:30

    లోక్‌సభ బీజేపీ ఎంపీలకు విప్

    • లోక్‌సభలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ

    • శుక్రవారం, శనివారం సభ్యులంతా సభకు హాజరు కావాలని విప్ జారీ

    • జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే ఛాన్స్

    • ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం