Share News

TG NEWS: బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎంపీలు మాస్ వార్నింగ్

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:21 PM

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.

TG NEWS:  బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎంపీలు మాస్ వార్నింగ్

ఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణపై రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ(గురువారం) ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని వివరించారని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలు భాగస్వాములు కావాలనిచామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.


మాజీ మంత్రి కేటీఆర్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కేటీఆర్ అసెంబ్లీకి తీసుకురావాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక విషం కక్కుతూ ఏడాది కాలంగా కేటీఆర్, హరీష్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది రాహుల్ గాంధీకి రాష్ట్ర ప్రజలకు తెలుసునని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.


బీఆర్ఎస్ చేసిన రూ. 7 లక్షల కోట్ల అప్పునకు ఏడాదికి రూ.64 వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు. రూ. 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని ఉద్ఘాటించారు. ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నామని.. మెస్ చార్జీలు పెంచామని తెలిపారు. అసెంబ్లీకి రాని దద్దమ్మలు తమ నేత రాహుల్ గాంధీకు లేఖలు రాస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.


కేటీఆర్‌కి తెలంగాణ గురించి ఏం తెలుసు: ఎంపీ బలరాం నాయక్

Balaram-Naik.jpg

మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసు అని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ.. పోరాటం చేసింది కాంగ్రెస్ ఎంపీలు అని గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదని తనతో కేటీఆర్ మాట్లాడాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారు.


రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 15ఏళ్లు పరిపాలిస్తుందని తెలిపారు. కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖరాయడం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు. రాహుల్ గాంధీ తమను అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటారని తెలిపారు. రాష్ట్రాన్ని ఏవిధంగా బీఆర్ఎస్ నాశనం చేసిందో రాహుల్ గాంధీకి వివరిస్తామని ఎంపీ బలరాం నాయక్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Love failure: ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా.. ఓ యువతి ఆవేదన..

TG NEWS: బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ ఎంపీలు మాస్ వార్నింగ్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 12 , 2024 | 12:47 PM