Congress: కాంగ్రెస్‌ను చంపేస్తారా.. జాతీయ నాయకులపై జగ్గారెడ్డి ఫైర్
ABN , Publish Date - Dec 12 , 2024 | 05:04 PM
ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ రాష్ట్రంలో ఉన్నారా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ..
కాంగ్రెస్ జాతీయ నాయకులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ వ్యవహారం సరిగ్గా లేదని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ రాష్ట్రంలో ఉన్నారా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి.. ఇలాగేనా అధికార పార్టీ ఉండే తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతోందా అని మండిపడ్డారు. తెలంగాణలో నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల కేటాయింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కీలక నేతలైన తమకు తెలియకుండా నియామకాలు జరుగుతుండటంపై జగ్గారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
పదవుల పంపకంపై..
పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి స్థానిక నేతలకు సరైన సమాచారం ఉండకపోవడంపై జగ్గారెడ్డి ఏఐసీసీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో ఎలాంటి చర్చలు జరపకుండానే పేర్లు ప్రకటిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. తమకు తెలియకుండా కొత్తవారిని పదవుల కోసం సిఫార్సు చేస్తున్నారని, అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాత తమకు తెలుస్తోందన్నారు. ఇలాచేస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ తెలంగాణ కష్టమవుతుందన్నారు. తెలంగాణలో పార్టీని చంపేయాలనే లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నట్లు ఆరోపించారు. ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగ్గారెడ్డికి ఆగ్రహం తెప్పించేలా ఎలాంటి నియామకాలు చేపట్టారనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది. గతంలోనూ పార్టీలో కొందరు నాయకుల తీరుపై జగ్గారెడ్డి బహిరంగంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని బహిరంగంగానే జగ్గారెడ్డి చెబుతుంటారు. దీనిలో భాగంగా ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ముక్కుసూటిగా
ఏ విషయానైన్నా జగ్గారెడ్డి ముక్కుసూటిగా చెబుతారనే పేరుంది. సొంత పార్టీ నేతలపై అప్పుడప్పుడు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అవతలివారి స్థాయిని పక్కనపెట్టి మరీ విమర్శలు చేస్తుంటారు. పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించినా ధీటుగా సమాధానం ఇస్తుంటారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నవారికి దక్కడం లేదదంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ తమ పనితీరు మార్చుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here