Home » CPM
పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.
ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.
ఖరీఫ్ సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తీవ్రమైన వర్షాభావం కారణంగా జిల్లాలో 29 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ...
Andhrapradesh: ఈ ఎన్నికలు దేశంలో చాలా కీలకంగా ఉన్నాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ఉంటుందా?.. లేదా?, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా?.. లేదా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న అనేక దారుణాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని సీపీఎం రాఘవులు ఫైర్ అయ్యారు. నేడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారకుడు జగనే.. ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షిస్తానంటూ జగన్ వ్యాఖ్యలు కార్మికులను, ప్రజల్ని ఎగతాళి చేయడమేనన్నారు.
Andhrapradesh: ప్రధాని మోదీ విజయవాడ వస్తున్నాడంటే ప్రజలు ఎదురు చూడాలని.. కాని విజయవాడ వాసులు మోదీ వస్తున్నారంటే నిరాశక్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మీట్ దిప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ ఏపీ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడలేదని.. దీంతో రాష్ట్ర ప్రజలంతా మోదీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీపీఎం కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. కమ్యునిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. సీపీఎం (CPM) పార్టీ కూడా ఈరోజు(సోమవారం) అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు సిద్ధమైంది. సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.