Home » Crime
హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, తలసాని ఓఎస్డీ కళ్యాణ్‌లను కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మంత్రాల పేరిట అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కిష్టపూర్లో ఒడిశా వాసి తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్ (41)కు చెప్పుకున్నాడు. అయితే తనకు తెలిసిన మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించాడు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. డబ్బుల మోజులో ఓ మహిళ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత...
ఉమ్మడి నెల్లూరు: జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లకూరు మండలం, చిల్లకూరు గ్రామంలో తండ్రి కొడుకులపై వైసీపీ నాయకులు కర్రలతో, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించారన్న కోపంతో వైసీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన వర్గీయులతో అర్ధరాత్రి దాడి చేయించారు.
కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వాట్సాప్ గ్రూప్‌లో తన పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్ నుంచి తనను తొలగించడంతో కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని..
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎ్‌సఐకు క్షిపణి రహస్యాలను చేరవేసిన కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్‌కు జీవిత ఖైదు పడింది. దాంతోపాటు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాగపూర్ జిల్లా కోర్టు జడ్జి ఎంవీ దేశ్‌పాండే సోమవారం తీర్పునిచ్చారు.