Sheep Scam: గొర్రెల స్కామ్ దర్యాప్తులో స్పీడు పెంచిన ఏసీబీ..
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:25 PM
హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, తలసాని ఓఎస్డీ కళ్యాణ్‌లను కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో గొర్రెల స్కామ్ (Sheep Scam) దర్యాప్తులో ఏసీబీ అధికారులు (ACB Officers) స్పీడ్ (Speed) పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీ (Custody)లోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్ (MD Ramchander Naik), తలసాని (Talasani) ఓఎస్డీ (OSD) కళ్యాణ్ (Kalyan)లను కస్టడీకి తీసుకున్నారు. కాగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది.
దీంతో ఏసీబీ అధికారులు సోమవారం నుంచి మూడు రోజుల పాటు రామ్ చందర్ నాయక్, కళ్యాణ్‌లను కస్టడీ విచారణ చేయనున్నారు. గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరోలుగా ఉన్న ఆ నేతలు ఇప్పుడు జీరోలు..
కేబినెట్ బెర్త్‌లపై ఆ ఎమ్మెల్యేల ఆశలు..
ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News