Share News

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:33 PM

ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని..

Watch Video: పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం.. బైక్‌పై మాట్లాడుతుండగా ముగ్గురు దూసుకొచ్చి..
Motorcycle Borne Assailants Shoot Two Youth

ఈమధ్య కాలంలో నేరస్థులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమను చట్టాలు ఏం చేయవన్న ధీమాతో నేరాలకు పాల్పడుతున్నారు. పగలు, ప్రతీకారాలు అంటూ.. అవతలి వ్యక్తుల్ని వేధింపులకు గురి చేయడమో లేదా చంపడానికైనా తెగబడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి షాకింగ్ ఘటనే బిహార్‌లోని పాట్నాలో (Patna Firing Case) చోటు చేసుకుంది. పట్టపగలే ముగ్గురు దుండగులు ఇద్దరు వ్యక్తులను వేటాడి.. వారిపై తుపాకులతో దాడులు చేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Read Also: అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే అదే ట్విస్ట్

పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతం వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి ఆగారు. వారి వెనకాలే మరో బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఈ దుండగులు దగ్గరకు వచ్చి.. తమతో పాటు తెచ్చుకున్న తుపాకులతో ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. పట్టపగలే నడిరోడ్డుపై ఈ దాడి జరగడంతో.. చుట్టుపక్కల ఉన్న సామాన్యులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read Also: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవాల్సిందేనా?

ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ దాడిలో బతికి బయటపడ్డ వ్యక్తి పేరు సూరజ్ అని, అతనిపై ఇప్పటికే డజన్ క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. బహుశా ప్రతికారం కోసమే దుండగులు ఈ దాడి చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాడులు జరిపిన వారితో సూరజ్‌కి శతృత్వం ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దుండగుల్ని పట్టుకోవడం కోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 05 , 2024 | 05:33 PM