Home » Crime
చికిత్స కోసం కోల్కతా వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో దారుణ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు శుక్రవారం బంగ్లాదేశ్కు చెందిన ఓ వ్యక్తిని బెంగాల్లోనే అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు.
మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు.
పుణెలో ఓ బాలుడు (17) మద్యం మత్తులో లగ్జరీ కారును అతి వేగంగా నడిపి... బైక్పై వెళుతున్న ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలిగొన్న ఘటన, రోడ్డు ప్రమాదాలపై 300 పదాల్లో వ్యాసం రాయమంటూ ఆ బాలుడికి 15 గంటల్లోనే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కృష్ణాజిల్లా కంకిపాడులో దారుణం వెలుగుచూసింది. దావులూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు ఓ దివ్యంగరాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. 26 ఏళ్ల వయసున్న ఓ దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గత వారం రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్ణావత్ చెప్పారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.
ఇరాన్ ప్రెసిడెంట్(iranian president) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) ఆ హెలికాప్టర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్లోని భారత ఎంబసీ సూచించింది.