Home » Crime
మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బొగ్గుల కొలిమిలో సజీవ దహనం చేసిన కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధిస్తూ రాజస్థాన్‌లోని బిల్వారాలో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ముద్దాయిలైన కాలూ, కన్హాలకు ఈ శిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిష్ణావత్ చెప్పారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.
ఇరాన్ ప్రెసిడెంట్(iranian president) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) ఆ హెలికాప్టర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్‌లోని భారత ఎంబసీ సూచించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించి.. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాగోలా అమాయకుల్ని మభ్యపెట్టి, వారి వద్ద నుంచి లక్షల రూపాయలు..
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్‌ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్‌పై తాజాగా మరికొందరు పీహెచ్‌సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు జిల్లా: చిలకలూరిపేట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. చీరాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. టిప్పర్ లారీని ఢీ కొంది
తరచూ ఫోన్ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది