Home » Delhi Excise Policy
లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో ఓ భూ కుంభకోణం వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోస్ట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఉండి పాలించే అంశంపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ వచ్చింది.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున 'కేజ్రీవాల్ కో ఆశీర్వాద్' ప్రచారానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారంనాడు ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయిందని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపకుండా చూస్తామని దేశ రాజధాని ప్రజలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా భరోసా ఇచ్చారు. బుధవారంనాడిక్కడ జరిగిన ఒక సమ్మిట్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన తాజా సమాధానమిచ్చారు.
Kavitha Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు బిగ్ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) విషయంలో రౌస్ అవెన్యూ(Rouse Avenue Court) కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ కస్టడీ(ED Custody) ముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం.
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) జారీ చేసిన ఆర్డర్స్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈడీ.. కాగితాలు, కంప్యూటర్ ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిశీని ప్రశ్నించింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ( Kejriwal ) సీఎం పదవికి రాజీనామా చేయలేదు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టడి నుంచి తొలి ఆర్డర్స్ సైతం జారీ చేసేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు