Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్డేట్
ABN , Publish Date - Apr 01 , 2024 | 03:38 PM
Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్-04కు వాయిదా పడింది. ఏప్రిల్-04న మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది. సోమవారం నాడు అటు ఈడీ (Enforcement Directorate) .. ఇటు కవిత తరఫున లాయర్ల సుదీర్ఘ వాదనలు వినిపించారు. దీంతో.. ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్విసమయం కోరారు. దీనికోసం ఏప్రిల్-03 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని సింఘ్వి వెల్లడించారు.
కేసీఆర్ స్పీచ్‌పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే...
కాగా.. కుమారుడి పరీక్షలు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్-16 వరకు కవిత మధ్యంతర బెయిల్ కోరారు. మధ్యంతర బెయిల్‌తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని మను సింఘ్వి కోర్టును కోరారు. దీనిపై ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం వాయిదా వేయడం జరిగింది. దీంతో ఏప్రిల్-03, 04 తారీఖుల్లో ఏం జరుగుతుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కవితకు సంబంధించి మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి