Home » Deputy CM Pawan Kalyan
పిఠాపురం: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు.
Andhrapradesh: మేనిఫెస్టోలో పెట్లిన సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పల్లా పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 67వ వార్డు హై స్కూల్ రోడ్లో పింఛన్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అందజేశారు.
అమరావతి: రెండవ సారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D Srinivas) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతంలో వారాహికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు.
రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అలాగే.. ఎంత కాలం నుంచి రోడ్లు మరమ్మత్తులు చేయలేదనే వివరాలను...
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమేనని అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయిని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(బుధవారం) సచివాలయంలోని తన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్నారు.