Share News

Pawan: ఏపీలో ఒకేరోజు పెద్దసంఖ్యలో గ్రామాసభలు

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:48 AM

Andhrapradesh: గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు.

Pawan: ఏపీలో ఒకేరోజు పెద్దసంఖ్యలో గ్రామాసభలు
Deputy CM Pawan Kalyan

అన్నమయ్య జిల్లా, ఆగస్టు 20: గ్రామ సభలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకేరోజున 13326 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగనున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) రైల్వేకోడూరులో జరిగే గ్రామసభకు హాజరుకానున్నారు. 23న అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరి వారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మోడల్ పంచాయతిగా మైసూరివారిపల్లె నిలిచింది. డిప్యూటి సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Kamala Harris: కమలా హ్యారీస్ సర్‌ప్రైజ్ ప్రసంగం.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు


కాగా.. గ్రామసభపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా పరిషత్‌ సీఈఓలు, డీపీఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు తదితరులతో పవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల్లో పనిచేయడమంటే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుపేద కూలీలకు సేవ చేయడమేనని నేను నమ్ముతున్నా. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నాం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100రోజుల పని దినాలను కల్పిస్తున్న అంశంపై అవగాహన కల్పించడంతో పాటు, అధికారులు కూలీలకు గల హక్కుల గురించి తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.

Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు



‘‘ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలి. గ్రామసభలు అర్థవంతంగా జరగాలంటే గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సభల్లో మనస్పూర్తిగా పాల్గొనాలి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే అందరూ ఉద్యోగులు గ్రామ సభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి సభలు విజయవంతానికి కృషి చేయాలి’’ అని పవన్‌ కోరారు.


ఇవి కూడా చదవండి..

Rains Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

Viral Video: ఈ దొంగ తెలివితేటలకు షాకవ్వాల్సిందే.. లోపలికి రాకుండా ఏటీఎమ్‌ను ఎలా లూటీ చేశాడో చూడండి..!

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 10:11 AM