Share News

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ABN , Publish Date - Aug 20 , 2024 | 08:40 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
CM Nara Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.


అలాగే సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధులు భేటీ కానున్నారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు పర్యటించనున్నారు. 3రోజులపాటు రాజధానిలో రెండు బ్యాంకుల ప్రతినిధులు ఉండనున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB ప్రతినిధులు రుణం సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం, CRDA ఉన్నతాధికారులతో బృందం వరుసగా భేటీ కానుంది.

Updated Date - Aug 20 , 2024 | 09:25 AM