Home » Deputy CM Pawan Kalyan
మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.
ఉభయ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న అఘోరి సోమవారం మంగళగిరిలో హంగామా సృష్టించింది. అఘోరి తరచూ మంగళగిరి వస్తూ.. ఆటోనగర్ ఎదురుగా ఉన్న ఓ కార్ వాష్ సెంటరులో కారును శుభ్రం చేయిస్తోంది.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ఈ సంఘటనటపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథాన తీసుకెళ్తోందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని, మానవత్వ పార్టీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
సోదర వియోగంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన గోర్లి సత్య నీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, కల్మషం లేకుండా ముక్కుసూటితనంగా మాట్లాడటం ఆయన నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.