Home » District
జగన్నాథ రథయాత్ర నగరవాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు. వివిధ రాషా్ట్రల నుంచి వచ్చిన కళాకారులు రథం ముందు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు హరినామస్మరణ చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. రథోత్సవం ప్రారంభానికి ముందు కేఎ్‌సఆర్ కళాశాల వద్ద ఇస్కాన జాతీయ ప్రతినిధులు ...
హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఖరీఫ్ సాగు వేగం పెంచారు. వరి నారును సిద్ధం చేసుకున్నారు. తుంగభద్ర జలాల కోసం ఎదురుచూస్తున్నారు. టీబీ డ్యాంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో వర్షపాతం ఆధారంగా.. ఇన ఫ్లోలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. డ్యాంలో శనివారం సాయంత్రానికి 30 టీఎంసీలకు పైగా నిల్వలున్నాయి. ఈ ఏడాది సాగునీరు ముందస్తుగానే వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రాజెక్టులో ...
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జిల్లాకు కేవీ మురళీకృష్ణను నియమించారు. అనకాపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మురళీకృష్ణను ఇక్కడకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ...
సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వాటి పరిస్థితి మెరుగుపడటం లేదు. నియోజకవర్గంలో ఏ వసతి గృహానికి వెళ్లి చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే.. చెప్పుకోని సమస్యలు మరెన్నో ఉన్నాయి. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక హాస్టల్ విద్యార్థులు నానా అగచాట్లు పడ్డారు. ఈ ఏడాది ...
రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం, విధుల కేటాయింపు, నియంత్రణ వంటి అంశాలలో వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంది. దీంతో విధి నిర్వహణలో గందరగోళం చోటు చేసుకుంటోంది. సచివాలయ సిబ్బందితోపాటు ఆర్బీకే సిబ్బందిని డిసి్ట్రక్ట్ సెలెక్షన కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమించారు. కానీ ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో కాగా, వారిని నియంత్రించే శాఖ మరొకటి కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవులు మంజూరు ...
కక్కలపల్లి కాలనీ పంచాయతీలో పనిచేసిన పలువురు కార్యదర్శులు అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి దోచిపెట్టడమే ధ్యేయంగా వ్యవహరించారు. ఇటివల ఇనచార్జిగా వ్యవహరించిన ఓ కార్యదర్శి ఆ కుటుంబంతో మరింత అంటకాగారు. అభివృద్ధి పనుల ముసుగులో పంచాయతీ ఆదాయాన్ని ఆ కుటుంబానికి కట్టబెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ వాటర్ ప్లాంట్‌కు కొత్త సిస్టమ్ కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి.. లక్షలాది ...
కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజల జీవితాలకు ప్రమాదకరమైనవని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్ చట్టాల మీద జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన హాల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెయిల్ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు అధికారులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడీషియరీ అధికారాలు ...
చిట్టీలు వేసిన ఓ విశ్రాంత ఉద్యోగి.. అప్పులు ఎక్కువై పారిపోయాడు. సుమారు రూ.కోటి వరకూ మోసపోయామని పలువురు మహిళలు గుత్తి పోలీస్ స్టేషనలో గురువారం ఫిర్యాదు చేశారు. గుత్తి ఆర్‌ఎ్‌సలోని బండిమోటు వీధిలో ఉంటున్న అత్తర్ హుస్సేన.. రైల్వేలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. సుమారు పదిహేనేళ్ల నుంచి చిట్టీలు నడుపుతున్నాడు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల చిట్టీలు నడిపేవాడని, గతంలో క్రమం తప్పకుండా సొమ్ము చెల్లించేవాడని బాధితులు తెలిపారు. ఇటీవల అప్పుల్లో కూరుకుయాడని ...
ప్రభుత్వ పాఠశాలల పనితీరు మరింత మెరుగుపడాలని విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ పరిధిలో పథకాలు, అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు పెండింగ్ పనుల వివరాలను ఇవ్వాలని సూ చించారు. పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని అన్నారు. కొన్ని మండలాలలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ, ఎస్‌ఎ్‌సఏ ...
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి పీర్లు మకానంలో బుధవారం కొలువుదీరాయి. తెల్లవారుజామున కుళ్లాయిస్వామి పీర్లను బంగారు ఆభరణాలు, పలు రకాల పూలు, వెండి గొడుగులతో ప్రత్యేకంగా అలంకరించారు. ...