Home » District
హెచ్చెల్సీకి ఈ నెల 28 తర్వాతే సాగు నీరు వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఈ రాజశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు వద్ద ఉన్న షెట్టర్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 25 టీఎంసీల నీరు ఉందని, 40 టీఎంసీల నీరు రాగానే డ్యాం అధికారులు హెచ్చెల్సీకి నీటి విడుదల చేస్తారన్నారు. తమ అంచనా ప్రకారం మరో 15 రోజుల్లోపు 40 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరే అవకాశం ఉందన్నారు. అలాగే హెచ్చెల్సీ 112, 119, 181 కి.మీ. ...
అధికారం అండతో రెండేళ్ల కిందట ఎస్కేయూలోని జన్మభూమి క్యాంటిన స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకులు ఏడాదిగా అద్దె కూడా చెల్లించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఈ విషయం బయటపడింది. అధికారులు నోటీసులిచ్చినా వైసీపీ నాయకుల నుంచి ధిక్కారమే ఎదురవుతోంది. దీంతో విద్యుత కనెక్షన కట్ చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని వర్సిటీ అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు వర్సిటీ క్యాంప్‌సలో జన్మభూమి క్యాంటిన ...
ఇది డంపులో జరిగిన అవినీతి కంపు కథ. వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల బినామీ సంస్థల అడ్డగోలు బాగోతం. ఆ పార్టీ వారే నిలదీసినా, కడిగేసినా పట్టించుకోకుండా దోపిడీ చేసిన వైనం. లక్షలాది మంది నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్ యార్డును కూడా అక్రమ సంపాదనకు వాడుకున్నారు. పాత చెత్తను పూర్తిగా తరలించాల్సింది పోయి.. పాత చెత్తను, కొత్త చెత్తను ఒకే చోట పోసి రూ.కోట్లు కొల్లగొట్టారు. కొందరు ఆడిట్ అధికారులు రైట్ రైట్ అంటూ బిల్లుల చెల్లింపునకు గ్రీనసిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రూ.9 కోట్ల పేమెంట్ జగినట్లు సమాచారం. మరో రూ.2 కోట్లను సైతం నొక్కేయాలని చూశారు. కానీ కొందరు ఆడిట్ అధికారులు చెక్ పెట్టడంతో ఆగినట్లు సమాచారం. ...
ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు భూగర్భగనుల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యువరాజ్ జీఓ నంబరు 70 జారీ చేశారు. 2019, 2021లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇసుకపాలసీని రద్దు చేస్తూ నూతన పాలసీ విడుదల చేశారు. ఉచిత ఇసుకకు సంబంధించిన పోస్టర్లను భూగర్భగనుల శాఖ ఏజీ రామకృష్ణప్రసాద్‌తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ...
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో
హమ్మయ్యా..! ఇంకేం భయం లేదు. ఇక నుంచి ఇసుక ఉచితంగా దొరుకుతుంది. భవన నిర్మాణ రంగం ఊపందు కుంటే తమకు చేతి నిండా పని దొరుకుతుందని భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి రోజుకు 20టన్నుల వరకు మాత్రమే ఉచితంగా ఇసుకను తరలించుకునే అవకాశం ఉం ది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉచి త ఇసుక విధానాన్ని సోమవారం కూటమి ...
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఇసుక విధానంపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఒక మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.195 అని తెలిపారు. ఇందులో రీచ నుంచి ఇసుకను డిపో వరకూ తరలించడం, లోడింగ్ చార్జీ, రాయల్టీ చార్జీలు కలిపి ఉంటాయని తెలిపారు. ఒక రోజుకి ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామని తెలిపారు. ఆధార్...
ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు పెద్ద దిక్కు.. అనంతపురం సర్వజన వైద్యశాల. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వ్యాధులు ప్రబలినా.. పరిగెత్తుకుంటూ పెద్దాసుపత్రికి వస్తారు. వీరిని అత్యవసరంగా పరీక్షించి.. తగిన వైద్యసేవలు అందించి.. ప్రాణాలు కాపాడటంలో కీలకంగా పనిచేసే విభాగం.. క్యాజువాలిటీ..! ఇలాంటి చోట తగినన్ని పడకలు, మౌలిక వసతులు కల్పించాలి. కానీ అలాంటివేవీ కనిపించవిక్కడ..! రోజుకు 300 నుంచి 400 మంది వరకూ రోగులు క్యాజువాలిటీకి వస్తారు. కానీ ఉన్న పడకలు 20 మాత్రమే..! అత్యవసర వైద్యం అందించి.. సంబంధిత విభాగాలకు పంపేందుకు కనీసం గంట పడుతుంది. ...
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అల్లూరి 127వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరిలాంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. అణగారిన వర్గాలు, గిరిజనుల సంక్షేమానికి ...
టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పీఠాలు కదులుతున్నాయి. ఎంపీపీ, మున్సిపల్ చైర్మన పదవుల్లో ఉన్న వైసీపీ నాయకులు.. అసమ్మతిని ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమ పనులు జరగకపోవడం, నిధులు, బిల్లుల విషయంలో వివక్ష చూపడంతో వైసీపీకి చెందిన కొందరు రగిలిపోతున్నారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో కొందరు