Home » District
‘ఉందామా..? వెళ్దామా..? ఉంటే ఇబ్బంది పడుతామేమో..! ప్రాజెక్టు నుంచి స్కూళ్లకు వెళితేనే మంచిదేమో..!’ ఇదీ కొందరు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల పరిస్థితి. అనంతపురం సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఉండే సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల కొన్నాళ్లుగా డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమకు ఉన్న పరిచయాలతో ...
వైసీపీతో అంటకాగిన పంచాయతీ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు కొత్త ప్రభుత్వం గుబులు పట్టుకుంది. అడ్డగోలు పనులు చేసినవారు చర్యల నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. పంచాయతీల పరిధిలోని విలువైన స్థలాలను వైసీపీ నాయకులకు అప్పనంగా కట్టబెట్టారు. ఈ క్రమంలో అధికారులను సైతం బురిడీ కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందులు ఎదురౌతాయని ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరు ఖాతరు చేయలేదు. ...
జిల్లాలో మలేరియా, డెంగీ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దోమలు ప్రబలే ప్రమాదం ఉందని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఫాగింగ్ చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రతంగా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని వసతి ...
పట్టణంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి మరో ఘనత దక్కింది. పదో తరగతికి కొత్త గా వచ్చిన సోషియల్ సబ్జెక్టులో భాగంగా హిస్టరీ పాఠ్యపుస్తకం ముఖ చిత్రంపై తాడిపత్రిలోని ప్రసి ద్ధ శైవక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ గాలిగోపురం ముఖచిత్రాన్ని రాష్ట్ర ప్రభు త్వం ముద్రించింది. నేటితరం విద్యార్థులకు అలనాటి ఆలయాల చరిత్ర, శిల్పకళ ...
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు గొంది అశోక్ కుమార్, రావి చైతన్య కిషోర్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర
నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగువేల మంది ప్రజలు తాగే నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. వాసన పసిగట్టి జనం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీకి ఓట్లు వేయలేదని కోపంతో ఆ పార్టీ నాయకుడు ఒకరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు (రాయదుర్గం నియోజకవర్గం) మండలం తుంబిగనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని...
వర్షాభావం, అకాల వర్షాలతో పంట నష్టపోయిన కరువు రైతులను ఆదుకోవడంలో వైసీపీ పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. గత ఐదేళ్లల్లో పంటనష్టం జరిగిన సమయాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు కనీసం పొలాలకు వెళ్లి పంటను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చిన దాఖలాలు లేవనే చెప్పాలి. జిల్లాలోని కొందరు రైతులకు అరకొరగా పంట నష్టపరిహారం అందించి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో పంటనష్టపోయిన ప్రతి రైతుకు ఇనపుట్ సబ్సిడీ అందించి ఆదుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో జిల్లా రైతాంగానికి రూ.1628 కోట్లు ...
వ్యవసాయం కలిసిరాలేదు. పాతాళ గంగ కరుణించలేదు. మట్టిని నమ్ముకుంటే బతుకు భారమైంది. గొర్రెలనైనా పెంచుకుని భార్యా బిడ్డలను పోషించుకుందామని అనుకున్నాడు. వ్యాధుల బారిన పడి అవీ మృత్యువాత పడ్డాయి. అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పూట గడవటం కష్టమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువ రైతు కుర్లపల్లి ఓబులేసు(36) ఉరి వేసుకున్నాడు. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం చిన్నప్పేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఓబులేసుకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్ల నుంచి ...
బక్రీద్ పండుగ నేపథ్యంలో పొట్టేళ్లు, మేక పోతులు భారీ ధర పలికాయి. సాధారణ పరిస్థితులలో గరిష్ఠంగా రూ.20 వేల వరకూ పలికే వీటిని పండుగ కోసం రూ.70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. బక్రీద్ కొనుగోళ్ల కారణంగా అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డులో పశువుల సంత శనివారం కళకళలాడింది. ఆత్మకూరుకు చెందిన నాగార్జున అనే వ్యాపారి ఓ పొట్టేలును రూ.48 వేలకు...
జిల్లా సర్వజన ఆసుత్రికి పట్టిన వైసీపీ గ్రహణం వీడుతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి, వైద్యకళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలకు రాజకీయ గ్రహణం పట్టడంతో ఐదేళ్లుగా పనులు పునాదులకే పరిమితమయ్యాయి. మరోవైపు మాతాశిశు సంరక్షణకు ఏర్పాటు చేపట్టిన ఎంసీహెచ బ్లాక్ వ్యవహారం కలగా మారిపోయింది. దీంతో రోగులకు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ...