Home » DMK
కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంత్రిగా ఉండటానికి తగరని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో మంగళవారంనాడు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఎంపీ వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా ఈ గందరగోళం చెలరేగింది.
లోక్‌సభ ఎన్నికల డీఎంకే(DMK) మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, సూచనలను తెలియజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్(CM Stalin) పిలుపునిచ్చారు.
చిన్నారిని చిత్రహింసలు చేసి పరారైన వ్యవహారంలో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి(DMK MLA Karunanidhi) కుమారుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి రాష్ట్రం నుంచి పదికంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్(State Congress) భావిస్తోంది. ఈ మేరకు తమకు మరిన్ని సీట్లు కావాలని డీఎంకేపై ఒత్తిడి పెంచుతోంది.
వైద్యుల సూచనల మేరకు రక్తపోటు తగ్గించుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కొద్ది దూరం పాదయాత్ర చేస్తున్నాడని ధర్మపురి ఎంపీ సెంథిల్‌కుమార్(Dharmapuri MP Senthilkumar) ఎద్దేవా చేశారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీఎం స్టాలిన్(CM Stalin) నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) ప్రకటించారు.
ఉత్తరాది రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ పార్లమెంటుకు బుధవారంనాడు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతిని కోరారు.
హిందీ భాషా రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్‌కుమార్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, గతంలోనూ తన పార్లమెంటు ప్రసంగాల్లో ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.
ద్రవిడ మున్నేట్ర కళగం ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందీ భాషా రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గెలుపు ఉండదని అన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ