Home » Doctor
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు విస్తుపోయే అంశాలను వివరించారు. సంజయ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే.. ఏ మాత్రం బాధ పడలేదని, పశ్చాతాపం అనేది అతనిలో ఏ కోశానా కనిపించలేదని పేర్కొన్నారు.
ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషియన్ పోస్టుల పదోన్నతుల్లో వసూళ్ల పర్వం మొదలైంది. కొందరు యూనియన్ నేతలు సీనియారిటీ జాబితాలో ఉన్నవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోల్కతాలో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీ కర్ వైద్య కళాశాలలో పనిచేసే ఓ పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ) వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, సిబ్బంది బదిలీలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
అసలే వ్యాధులు ప్రబలే సీజన్. డెంగీ, మలేరియా, చికున్గున్యా, వైరల్ ఫీవర్ల వంటివి విజృంభిస్తున్న సమయం. పెద్దాస్పత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం.
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ర్యాంకులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ దఫా 49,184 మంది క్వాలిఫై అయునట్లు గుర్తించింది.
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది.