Share News

Damodar Rajanarasimha: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచండి

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:36 AM

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.

Damodar Rajanarasimha: ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచండి

  • కోల్‌కతా ఘటన నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణనిస్తూ, కోల్‌కతా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బందికి భద్రత పెంచాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను మంత్రి ఆదేశించారు.


డాక్టర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతకు సంబంధించి అనేక అంశాలను పొందుపరిచిందని గుర్తు చేశారు. మహిళా డాక్టర్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు మంత్రి రాజనర్సింహ సంఘీభావం తెలిపారు.

Updated Date - Aug 17 , 2024 | 03:36 AM