Share News

Uttar Pradesh: పురుషుడికి గర్భాశయం.. అండాశయం కూడా..!!

ABN , Publish Date - Aug 12 , 2024 | 08:12 PM

జన్యుపర లోపాలతో స్త్రీ, పురుషుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అవి కొన్నేళ్లకు బయట పడుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ పురుషుడికి ఇలానే బయట పడింది. రాజ్ గిరి మిస్త్రీ (46)కి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల అతను కడుపునొప్పితో ఇబ్బంది పడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు.

Uttar Pradesh: పురుషుడికి గర్భాశయం.. అండాశయం కూడా..!!
UP Man

జన్యుపర లోపాలతో స్త్రీ, పురుషుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అవి కొన్నేళ్లకు బయట పడుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కూడా ఓ పురుషుడికి ఇలానే బయట పడింది. రాజ్ గిరి మిస్త్రీ (46)కి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల అతను కడుపునొప్పితో ఇబ్బంది పడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

హెర్నియా సర్జరీ..

కడుపు నొప్పి రావడంతో అల్ట్రాసౌండ్ పరీక్ష చేసుకున్నాడు. కడుపు కింది భాగంలో మాంసం ఇతర అవయవాలతో తాకినట్టు కనిపించింది.హెర్నియా సమస్య వచ్చిందని వైద్యులు గుర్తించారు. అతని వద్ద తగిన డబ్బులు లేకపోవడంతో హెర్నియా సర్జరీ కోసం ఉచిత వైద్య శిబిరానికి వెళ్లాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. సర్జరీ చేస్తుండగా పొత్తు కడుపు పొర నుంచి బయటకు వచ్చిన చిన్న మాంసపు ముద్దను కనుగొన్నారు. అది చూడడానికి చిన్న గర్భాశయం లాగా కనిపించింది. దాని పక్కనే అండాశయం కూడా ఉంది. దానిని చూసి ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతయ్యింది.


గర్భాశయం.. అండాశయం గుర్తింపు

మిస్త్రీకి హెర్నియాతో పాటు గర్భాశయం, అండాశయాన్ని సర్జరీ చేసి తొలగించారు. ఆపరేషన్ చేసిన తర్వాత మిస్త్రీ ఆరోగ్యంగా ఉన్నారని బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర దేవ్ తెలిపారు. మిస్త్రీకి ఇది పుట్టుకతో వచ్చిన వైకల్యం అని వివరించారు. అతనికి ఎలాంటి స్త్రీ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.


Read More
National News
and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 08:12 PM