Home » Donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై తుపాకి కాల్పుల్లో కుట్ర కోణం ఉందా? అమెరికా ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండగానే రాజకీయ లబ్ధి కోసమే రిపబ్లికన్లు ఇలా చేశారా? ఇవే అనుమానాలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
Attack on Trump: ట్రంప్‌పై దాడిని 4 నెలల క్రితమే జోస్యం చెప్పిప పాస్టర్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఈ రాజకీయ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై ....
పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) థామస్ మాథ్యూ క్రూక్స్ (20) అనే దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవిపై నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది.
రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.
గన్‌కల్చర్‌కు నెలవైన అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది..! ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. 5-6 రౌండ్ల కాల్పులు జరపగా ఆ సమయానికి ట్రంప్ కాకతాళీయంగా ముఖాన్ని పక్కకు తిప్పడంతో ఆయన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకుపోయింది.
ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ .....
అమెరికా తుపాకీ సాధారణ పౌరులపైనే కాదు, అధ్యక్షులపైనా పేలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్ కాల్పులకు తెగబడ్డాడు. అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇప్పటి వరకు 9 మంది దేశాధినేతలు, అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులపై దుండగులు కాల్పులు జరిపారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిపై నుంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ఒకరు తెలిపారు. నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.
పెన్సిల్వేనియాలో ఆదివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికలు జరగనున్న ఏడాదిలో ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.