Share News

Attack On Trump: ట్రంప్‌పై హత్యాయత్నంలో కుట్ర కోణం.. వెలుగులోకి అనుమానాలు?

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:44 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై తుపాకి కాల్పుల్లో కుట్ర కోణం ఉందా? అమెరికా ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండగానే రాజకీయ లబ్ధి కోసమే రిపబ్లికన్లు ఇలా చేశారా? ఇవే అనుమానాలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.

Attack On Trump: ట్రంప్‌పై హత్యాయత్నంలో కుట్ర కోణం.. వెలుగులోకి అనుమానాలు?
Attack On Trump

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం ఉందా? అమెరికా ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండగా రాజకీయ లబ్ధి కోసం రిపబ్లికన్లు ప్లాన్ ప్రకారం చేశారా?.. అనే అనుమానాలను ప్రస్తుతం కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. ట్రంప్‌పై కాల్పులు జరిగిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ‘Staged’ (ప్రదర్శన) అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది.


ఈ పదానికి తెలుగులో రంగస్థలం లేదా ప్రదర్శన అని అర్థం. ప్రణాళిక ప్రకారం జరిగే కుట్ర సిద్ధాంతాలకు పర్యాయపదంగా దీనిని వాడుతుంటారు. దాడి లేదా కాల్పుల వాస్తవికతను ప్రశ్నించడానికి తరచుగా వినియోగిస్తుంటారు. సాధారణంగా వదంతులు, ద్వేషపూరిత ప్రసంగాలకు ఈ మధ్య కేంద్ర బిందువుగా ఉంటున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్‌‌’లో తాజా ఈ పదం ట్రెండ్ కావడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. 1963లో అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీపై జరిగిన హత్యలో కూడా కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


తుపాకీ కాల్పులు జరిగినా ఎవరూ పరిగెత్తలేదేం?

‘‘ట్రంప్ సభాప్రాంగణం ఒక రంగస్థలంగా కనిపించింది. తుపాకీతో కాల్పులు జరిగినా అక్కడి సమూహంలో ఎవరూ పరిగెత్తలేదు. భయపడలేదు. నేను ట్రంప్‌ని నమ్మను’’ ఒక నెటిజన్‌ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిపై ముందుగానే ఎందుకు కాల్పులు జరిపారు. జనాలు ఉండగా అలా ఎలా కాల్చారు?’’ అని ఓ అమెరికన్ వ్యక్తి ప్రశ్నించడం ‘ఎక్స్’లొ కనిపించింది.


ఫొటోలు పర్‌ఫెక్ట్‌గా తీశారా?

దాడి తరువాత కెమెరామెన్లు ఫొటోలు కూడా చాలా పర్ఫెక్ట్‌గా తీశారని ఇదెలా సాధ్యమైందని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కి మిలియన్ వ్యూస్ వచ్చాక దాన్ని తొలగించాడు. "సానుభూతి పొందడానికి సభ ఏర్పాటు చేశారా? నేను ట్రంప్‌ని నమ్మను. ఆయన కోసం ప్రార్థించను" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్లలో ఎక్కువగా అధికారిక డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు బీబీసీ నివేదిక తెలిపింది. అయితే ఈ ఆరోపణల్ని రిపబ్లికన్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు.

Vanga Baba Predictions: ట్రంప్‌, పుతిన్‌కు తొలగని ప్రాణహాని? వంగాబాబా భయంకర జోస్యం

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 12:25 PM

News Hub