Home » Drugs Case
బాయ్స్ హాస్టల్(Boys Hostel)ను షెల్టర్‌జోన్‌గా వినియోగించుకొని, బెంగళూరు(Bangalore) నుంచి డ్రగ్స్ తెచ్చి గుట్టుగా నగరంలో సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సమయంలో బెంగుళూరు నుంచి నగరానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గురించి తెలిసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) పోలీసులు ఇటీవల ఛేదించిన నైజీరియా డ్రగ్స్ ముఠా కేసులో తవ్విన కొద్దీ విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన విశాఖ కంటెయినర్ డ్రగ్స్ కేసులో పురోగతి కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ విశాఖకు దిగుమతి కావడం ఎన్నికల వేళ రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈస్ట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు నమూనాలు సేకరించి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకూ నివేదికలు మాత్రం బయటకు రాలేదు.
భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి అస్సలు వదిలిపెట్టడం లేదు. పోలీసులు, నాట్కోటిక్ బ్యూరో అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డ్రగ్స్ సరఫరా నిర్మూలన జరగడం లేదు. రోజుల వ్యవధిలోనే డ్రగ్స్ పట్టుపడుతున్న సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
Telangana: డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిని, డ్రగ్స్ తీసుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా డ్రగ్స్ సరఫరాకు మాత్రం అడ్డుకట్ట పడని పరిస్థితి. ముఖ్యంగా భాగ్యనగరంలో డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో పలు చోట్ల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్‌లో వెల్లడించారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్(Hyderabad IT Corridor)లో.. సైబర్టవర్స్ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్‌పార్టీని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు.
నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది.