Drugs Case: సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్ కేసు ఏమైంది?
ABN , Publish Date - Jul 30 , 2024 | 11:02 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన విశాఖ కంటెయినర్ డ్రగ్స్ కేసులో పురోగతి కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ విశాఖకు దిగుమతి కావడం ఎన్నికల వేళ రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈస్ట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు నమూనాలు సేకరించి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకూ నివేదికలు మాత్రం బయటకు రాలేదు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన విశాఖ కంటెయినర్ డ్రగ్స్ కేసులో పురోగతి కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ మాటున డ్రగ్స్ విశాఖకు దిగుమతి కావడం ఎన్నికల వేళ రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈస్ట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు నమూనాలు సేకరించి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకూ నివేదికలు మాత్రం బయటకు రాలేదు. దీనిపై రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ మెుదలైంది.
మార్చి 16న బ్రెజిల్ నుంచి 25,000కిలోల ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌తో ఓ కంటెయినర్ విశాఖ తీరానికి వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారం మేరకు ఆపరేషన్ గరుడ పేరుతో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు డ్రైడ్ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఆర్డర్ పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. కంటెయినర్ ఓపెన్ చేసి బ్యాగుల్లో ఏం ఉందో తెలుకునేందుకు నమూనాలు సేకరించారు. అనంతరం వాటని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అయితే దీంట్లో వైకాపా నేతల ప్రమేయం ఉందంటూ అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.
సాక్ష్యాల సేకరించడం, దిగుమతిదారుల వాంగ్మూలం నమోదు అనంతరం సీబీఐ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోయారు. దర్యాప్తు కూడా అక్కడ్నుంచే చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఓ అధికారుల బృందం బ్రెజిల్ వెళ్లి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు కస్టమ్స్ అధికారులను తప్పించుకుని దేశంలోకి నౌక ఎలా ప్రవేశించిందనే అంశంపై ఇంకా వివరాలు బయటకు రాలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు సీజ్ చేసిన కంటెయినర్ ఇంకా విశాఖ కంటెయినర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జామిన్ పాయింట్‌లోనే ఉంది. దీనికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతిస్తోంది. డ్రైడ్ ఈస్ట్‌కు దొరికిన కేసులో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌తోపాటు, మరికొంతమందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. అయినా కేసులో పెద్దగా పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి:
Fire Accident: విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు..