Share News

Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ABN , Publish Date - Aug 03 , 2024 | 12:50 PM

బాయ్స్‌ హాస్టల్‌(Boys Hostel)ను షెల్టర్‌జోన్‌గా వినియోగించుకొని, బెంగళూరు(Bangalore) నుంచి డ్రగ్స్‌ తెచ్చి గుట్టుగా నగరంలో సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు.

Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

- ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు

- రూ.12 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: బాయ్స్‌ హాస్టల్‌(Boys Hostel)ను షెల్టర్‌జోన్‌గా వినియోగించుకొని, బెంగళూరు(Bangalore) నుంచి డ్రగ్స్‌ తెచ్చి గుట్టుగా నగరంలో సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి(Director of Excise Enforcement Kamalasan Reddy) తెలిపిన వివరాల ప్రకారం..

ఇదికూడా చదవండి: Hyderabad: ఫోన్‌ లాక్కుని.. లాకప్ పక్కన నేలపై కూర్చోబెట్టి..


బెంగళూరుకు చెందిన మెహిత్‌ లోకేశ్‏రావు, యజ్ఞదత్తు డ్రగ్స్‌ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని బాయ్స్‌ హాస్టల్లో ఉంటూ వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాస్టల్‌పై దాడి చేసి లోకేష్‏రావు, యజ్ఞదత్తుతోపాటు మరో నిందితుడు రావూఫ్‏లను అరెస్ట్‌ చేశారు.


రేవ్‌పార్టీతో తీగలాగిన అధికారులు...

ఇటీవల సైబర్‌ టవర్స్‌ సమీపంలో జరిగిన రేవ్‌పార్టీపై ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేసి ఐదుగురు ప్రధాన నిందితులతోపాటు 20 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించే క్రమంలో బెంగళూరు(Bangalore)కు చెందిన ఓ ముఠా సైతం డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నదని, వచ్చినప్పుడు బాయ్స్‌ హాస్టల్‌లో బస చేస్తున్నదని చెప్పడంతో వారిపై నిఘా ఉంచి పట్టుకున్నారు. చాకచక్యంగా డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్న ఎస్‌టీఎఫ్‌ అధికారులను కమలాసన్‌రెడ్డి అభినందించారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 12:50 PM