Home » Duddilla Sridarbabu
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. యూఎస్‌లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడంలో కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. రాజకీయ కోణంలో రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని కోరారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం వెనక్కిపోదన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
బీఆర్ఎస్ (BRS) నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు.
‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుంది. కేసీఆర్‌కు సిగ్గుతోపాటు మతి కూడా తప్పింది. అసలు ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా?’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేశారు.
అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) తెలిపారు.ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేయడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, దారుణానికి పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వ పనితీరే సమాధానం చెబుతోందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అభివృద్ధిలో మార్పు తెస్తుందని... మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.