Share News

Telangana Pilgrimage: అందుబాటులోకి సరస్వతీ పుష్కరాల యాప్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:43 AM

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతీ పుష్కరాలకు సంబంధించి భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ ను మంత్రులు శ్రీధర్‌ బాబు, కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ పుష్కరాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రులు ప్రకటించారు

Telangana Pilgrimage: అందుబాటులోకి సరస్వతీ పుష్కరాల యాప్‌

  • ఆవిష్కరించిన మంత్రులు శ్రీధర్‌ బాబు, సురేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాలపై భక్తులకు సమగ్ర సమాచారం తెలియజేసేందుకు రూపొందించిన వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ... సరస్వతీ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాలకు ప్రతి రోజూ 50 వేల మందికిపైగా భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించవచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రధాన పుష్కర ఘాట్‌ వద్ద 17 అడుగుల రాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు, భక్తుల సౌకర్యాం కోసం చలువ పందిళ్లు, శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేస్తున్నామని వివరించారు.

Updated Date - Apr 16 , 2025 | 04:43 AM