Saraswati Pushkaralu 2025: తెలంగాణలో పుష్కరాలకు వేళాయె.. ప్రత్యేక మొబైల్ యాప్ మీకోసమే
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:06 AM
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ సరస్వతీ పుష్కరాల ఎప్పుటి నుంచి మొదలవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్, ఏప్రిల్ 16: మన దేశంలో ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం ప్రాప్తిస్తుందనేది భక్తుల విశ్వాసం. ఇప్పుడు తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu 2025) రానున్నాయి. ఇందులో కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాల నిర్వహణ జరుగనుంది. మే 12 నుంచి 26 వరకు అంటే 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల కోసం ప్రత్యేకమైన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను రూపొందించింది సర్కార్. వీటితో పాటు పుష్కరాలకు సంబంధించిన పోస్టర్‌ను రూపొందించారు. వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌తో పాటు పోస్టర్‌ను మంత్రులు కొండా సురేఖ (Minister Konda Surekha), శ్రీధర్ బాబు (Minister Sridharbabu) ఆవిష్కరించారు. పుష్కరాల్లో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు వెల్లడించారు.
పెద్ద ఎత్తున ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాలకు దాదాపుగా 35 లక్షల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతీ ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దాదాపు సరస్వతీ పుష్కరాల కోసం రూ.35 కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నామని చెప్పారు. ఈ పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాల కోసం కాశీ నుంచి పండితులు వస్తున్నారని.. పుష్కరాల జరిగే 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, హారతులను పండితులు నిర్వహిస్తారని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
చాలా ఆనందంగా ఉంది: మంత్రి శ్రీధర్ బాబు
2013లో తమ హయాంలోనే సరస్వతీ పుష్కరాలు జరిగాయలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పుడు మళ్లీ తమ హయాంలో సరస్వతీ పుష్కరాలను నిర్వహిస్తుండటంతో చాలా ఆనందంగా ఉందన్నారు. భక్తుల కోసం వంద పడకల టెంట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సరస్వతీ పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు తరలివస్తారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Illegal immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపరాఫర్..
Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..
Read Latest Telangana News And Telugu News