Home » Duddilla Sridarbabu
Telangana: ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోట్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ బయటకి వస్తారన్నారు.
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పే కట్టుకథలను నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. బుధవారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ...బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు.
మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నగరంలోని ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్నలాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటును పరిశీలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. త్వరలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విధానపరంగా మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న వక్తల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
Telangana: ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ఐసీపీలో బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీను పునరుద్ధ రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శనివారం బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్‌తో చంద్రశేఖర్ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..
బీజేపీ ( BJP ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) ని కరీంనగర్లో గెలిపిస్తే ఒక్కరూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గ్రామగ్రామాన అభివృద్ధి చేసింది.. ఆనాటి ఎంపీ వినోద్ కుమార్ మాత్రమేనని గంగుల కమలాకర్ తెలిపారు.
అదానీ గ్రూప్ ( Adani Group ) పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని.. పెట్టుబడులు పెట్టేవాళ్లకి వెల్కమ్ చెబుతున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.