Share News

Minister Sridhar Babu: స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళిక,.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:11 PM

Minister Sridhar Babu: గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు.

Minister Sridhar Babu: స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళిక,.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Minister Sridhar Babu

హైదరాబాద్: తమ ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మంత్రి శ్రీధర్ బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబును భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... బ్యాడ్మింటన్‌ను ప్రోత్సహించాలని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేశారని చెప్పారు. అనేకమంది క్రీడాకారులను తయారు చేసిన ఘనత గోపీచంద్ అకాడమీది అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు. గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. బ్యాడ్మింటన్ ప్రోత్సాహానికి కూడా తాము ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 3వ తేదీనుంచి 10వ తేదీవరకు ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరుగుతుందని వివరించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుగుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి గ్రోత్ ఉంది: పుల్లెల గోపిచంద్

Pullela-Gopichand.jpg

దేశంలో బ్యాడ్మింటన్‌కు మంచి గ్రోత్ ఉందని.. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహిస్తామని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అండర్ 19 ఆల్ ఇండియా జూనియర్, ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్‌ మాట్లాడారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు మంత్రి శ్రీధర్ బాబు ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి కలిశామని అన్నారు. ఈరోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆల్ ఇండియా జూనియర్ ర్యాంక్ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. 7వ తేదీన మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనే నిర్ణయం మంచిదని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమని చెప్పారు. క్రీడాకారులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని అన్నారు. స్పోర్ట్స్‌పై విధిస్తున్న జీఎస్టీ తీసివేస్తే బాగుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ తీసివేస్తే క్రీడాకారుల తయారీకి ప్రోత్సహించినట్లుగా ఉంటుందని పుల్లెల గోపిచంద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 06:13 PM